పసిపాపల చిరునవ్వులకు సంతసించు
నా మనసును మొద్దుబారనీయకు,
చిరుజల్లుకు హరివిల్లుకు ఉప్పొంగే
నా గుండెలోని ఆనందం ఆవిరవనీయకు,
సాటి మనిషివేదనకు చెమర్చు
నా కంటితడిని ఆరిపోనీయకు,
స్వామీ నా ప్రార్ధన మన్నించి
నాలోని మనిషిని మరణించనీయకు.
Tuesday, 20 April 2010
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
bAgundi.chAla rOjulaki kavi ni nidra leparu.
ఇదే వల్లభ నా రూం వైట్ బోర్డు మీద:
"మనిషిని మనిషిగా బ్రతకనివ్వదు ఈ సమాజం,
నీలోని మనిషి మనగలడా లేక మరణిస్తాడా?"
అని ప్రశ్నించాడు.
జవాబు దొరికిందా వల్లభా?
Post a Comment